విజేందర్‌కు చైనా జుల్ఫికర్ ప్రతి సవాల్.. ఇంటికొస్తాడట.. బెల్టులు తీసుకెళ్తాడట!?
భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా పోరు జరుగనుంది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చైనా ఆటగాడు జుల్ఫికర్‌తో ఆగస్టు ఐదో తేదీన తలపడన
భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా పోరు జరుగనుంది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చైనా ఆటగాడు జుల్ఫికర్‌తో ఆగస్టు ఐదో తేదీన తలపడనున్నాడు. ఈ పోరాటం ఇరు దేశ ప్రజల మధ్య ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా ఈ పోరాటానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ "బ్యాటిల్ గ్రౌండ్ ఆసియా" అనే పేరు కూడా పెట్టింది.
ఈ నేపథ్యంలో చైనా ప్రొడక్ట్ వ్యాఖ్యలపై విజేందర్ చేసిన వ్యాఖ్యలకు జుల్ఫికర్ సమాధానమిచ్చాడు. మొన్నటికి మొన్న తన కోసం ప్రార్థించాలంటూ.. చైనా ప్రత్యర్థి జుల్ఫికర్‌ను 45 సెకన్లలో నాకౌట్ చేసేందుకు ప్రయత్నిస్తానని కామెంట్ చేశాడు. ఇంకా అతడిని రెచ్చగొట్టే విధంగా చైనా ఉత్పత్తులు ఎక్కువకాలం మన్నికగా వుండవని ఎద్దేవా చేశాడు.
ఈ వ్యాఖ్యలపై జుల్ఫికర్ మాట్లాడుతూ.. విజేందర్‌కు ప్రతి సవాల్ విసిరాడు. బాక్సింగ్ కోర్టులో సత్తా ఏంటో నిరూపిస్తానన్నాడు. విజేందర్‌కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని.. ఆగస్టు 5న విజేందర్ ఇంటికొస్తా.. తన బెల్టుతో పాటు అతని బెల్టు కూడా తీసుకెళ్తానని సవాల్ విసిరాడు.