పీవీ సింధుకు వెయ్యి గజాల ఇంటి స్థలం.. పత్రాలను అందజేసిన కేసీఆర్
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలంగాణ సర్కారు వెయ్యి గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో పీవీ సింధుకు అందజే
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలంగాణ సర్కారు వెయ్యి గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో పీవీ సింధుకు అందజేశారు. ఇందుకు ఆమె సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బాడ్మింటన్‌లో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు.
ప్రపంచ క్రీడా వేదికపై హైదరాబాద్ పేరు నిలబెట్టాలన్నారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి హైదరాబాద్ గడ్డపై అడుగు పెట్టిన రోజే సింధుకు ఇంటి స్థలం కేటాయిస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై బాలీవుడ్‌లో బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే స్ఫూర్తితో తెలుగుతేజం, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోనూసూద్ బయోపిక్‌ను తెరకెక్కించునున్నాడు.
ఈ విషయాన్ని సోనూసూద్ మీడియాతో స్వయంగా తెలిపారు. ఎనిమిది నెలల నుంచి సింధు బయోపిక్ గురించి చర్చిస్తున్నామని త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పీవీ సింధు తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొందో అందరూ తెలుసుకోవాలని సోనూసూద్ అన్నారు.