Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో దారుణం : ఇద్దరు తైక్వాండో క్రీడాకారిణులపై కోచ్ అత్యాచారం

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. క్రీడల్లో శిక్షణ ఇస్తున్న కోచ్ ఇద్దరు జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే.. జార్ఖండ్ రాష్ట్రంల

Advertiesment
Taekwondo players allege rape
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (10:56 IST)
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. క్రీడల్లో శిక్షణ ఇస్తున్న కోచ్ ఇద్దరు జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే.. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ అత్యాచార ఘటనపై ఇద్దరు క్రీడాకారిణులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు తైక్వాండో క్రీడాకారిణులు ఢిల్లీలో శిక్షణ పొందుతున్నరు. తొలుత 9వ తరగతి క్రీడాకారిణికి శిక్షణ ఇచ్చే కోచ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆ బాలిక కోచ్ ఇంటికి వెళ్లగా మత్తు మందు కలపిన పానీయం ఇచ్చి అత్యాచారం జరిపాడు. స్పృహలోకి వచ్చాక దీనిపై ప్రశ్నిస్తే క్రీడాకారిణి అభ్యంతరకరంగా ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియో చూపి దీనిపై ఫిర్యాదు చేస్తే వీటిని బయటపెడతానని కోచ్ బెదిరించాడు. దీంతో ఆ సమయంలో మిన్నకుండివున్న ఆ బాలిక.. ఆ తర్వాత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తనకు భోజనంలో మత్తుమందు కలిపి పెట్టి తనపై కూడా కోచ్ అత్యాచారం జరిపాడని మరో క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు క్రీడాకారిణుల ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ మణదీప్ రాంధ్వా చెప్పారు. కోచ్ తమపై అత్యాచారం చేయడమే కాకుండా తమ అశ్లీల చిత్రాలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎనిమిదేళ్లుగా తమపై అత్యాచారం చేస్తున్నాడని బాధిత క్రీడాకారిణులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔట్ కాకున్నా కోహ్లీ ఎందుకు ఔటయ్యాడు? అదే కెప్టెన్సీ అంటే..!