Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ - అర్జున - ద్రోణ - ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు వీరే...

ఈ సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్‌రత్న,అర్జున‌, ద్రోణాచ‌ర్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. క్రీడ‌ల్లో విశిష్టంగా రాణించిన వారికి ఈ పుర‌స్కారాల‌ను అంద‌జేస్తారు.

Advertiesment
రాజీవ్ - అర్జున - ద్రోణ - ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు వీరే...
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (17:04 IST)
ఈ సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్‌రత్న,అర్జున‌, ద్రోణాచ‌ర్య, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. క్రీడ‌ల్లో విశిష్టంగా రాణించిన వారికి ఈ పుర‌స్కారాల‌ను అంద‌జేస్తారు. పారా అథ్లెట్ దేవేంద్ర జ‌జ‌రియా(జావ్లిన్ త్రో), హాకీ ప్లేయ‌ర్ స‌ర్దార్ సింగ్‌ల‌కు రాజీవ్ ఖేల్ ర‌త్న అవార్డులు ద‌క్కాయి. ద్రోణాచార్యకు ఈసారి ఏడు మంది ఎంపిక‌య్యారు. ఈ అవార్డు గ్రహీతల వివరాలను పరిశీలిస్తే... 
 
ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు.. డాక్ట‌ర్ ఆర్‌.గాంధీ (అథ్లెటిక్స్‌), హీరా నంద్ క‌టారియా(క‌బ‌డ్డీ), జీఎస్ఎస్‌వీ ప్ర‌సాద్‌(బ్యాడ్మింట‌న్ - లైఫ్‌టైమ్‌), బ్రిజ్ భూష‌ణ్ మోహంతి (బాక్సింగ్-లైఫ్‌టైమ్‌), పీఏ. రాఫెల్‌(హాకీ-లైఫ్‌టైమ్), సంజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి(షూటింగ్‌-లైఫ్‌టైమ్), రోష‌న్ లాల్‌(రెజ్లింగ్-లైఫ్‌టైమ్‌) ఉన్నారు. 
 
అర్జున అవార్డు గ్రహీతల వివరాలు... వీజే సురేఖ‌(ఆర్చ‌రీ), కుష్బీర్ కౌర్‌(అథ్లెటిక్స్‌), అరోకియా రాజీవ్‌(అథ్లెటిక్స్‌), ప్ర‌శాంతి సింఘ్‌(బాస్కెట్‌బాల్‌), సుబేదార్ లైసిరామ్ దేబేంద్రో సింగ్‌(బాక్సింగ్‌), చ‌తేశ్వ‌ర పుజారా(క్రికెట్‌), హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌(క్రికెట్‌), ఓయిన‌మ్ బెంబీ దేవీ(ఫుట్‌బాల్‌), ఎస్‌పీ చౌరాసియా(గోల్ఫ్‌), ఎస్‌వీ సునీల్‌(హాకీ), జ‌స్వీర్‌సింగ్‌(క‌బడ్డీ), పీఎన్ ప్ర‌కాశ్‌(షూటింగ్‌), ఏ అమ‌ల్‌రాజ్‌(టేబుల్ టెన్నిస్‌), సాకేత్ మైనేని(టెన్నిస్‌), స‌త్య‌వ‌ర్తి క‌డియ‌న్‌(రెజ్లింగ్‌), మ‌రియ‌ప్ప‌న్‌(పారా అథ్లెట్‌), వ‌రున్ సింగ్ భాటి(ప్యారా అథ్లెట్‌)లు ఉన్నారు. 
 
ధ్యాన్‌చంద్‌ను అవార్డు గ్రహీతలు... ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపికైన వారిలో భూపేంద్ర సింగ్‌(అథ్లెటిక్స్‌), స‌య్యిద్ షాహిద్ హ‌కిమ్‌(ఫుట్‌బాల్‌), సుమ‌రాయ్ టీటీ(హాకీ)లు ఉన్నారు. ఈనెల 29న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డుల‌ను అంద‌జేస్తారు. అవార్డు గ్ర‌హీత‌ల‌కు మెడ‌ల్‌, ప్ర‌శంసా ప‌త్రంతో పాటు న‌గ‌దు ప్రైజ్‌ను అంద‌జేస్తారు. రాజీవ్ ఖేల్ ర‌త్నాల‌కు రూ.7.5 ల‌క్ష‌లు, అర్జున‌, ద్రోణాచ‌ర్య‌, ధ్యాన్‌చంద్ అవార్డు గ్ర‌హీత‌ల‌కు స‌ర్టిఫికెట్‌తో పాటు రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు బహుమతిని ఇస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ తరహా పీఎస్ఎల్‌లో చైనా క్రికెటర్లు.. పాకిస్థాన్‌కు వస్తారట..