సారీ చెప్పిన శోభా డే.. పీవీ సింధు, సాక్షిలపై శోభా డే ప్రశంసల వర్షం...
మనోళ్లకు పతకాలు రావు కేవలం సెల్ఫీల కోసమే రియోకు వెళ్లారని, వారిపై చేసిన ఖర్చంతా వృధా అని సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు
మనోళ్లకు పతకాలు రావు కేవలం సెల్ఫీల కోసమే రియోకు వెళ్లారని, వారిపై చేసిన ఖర్చంతా వృధా అని సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు శోభా డే తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. అంతేకాదు.. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రజత పతకం విజేత సింధు, కాంస్య పతకం విజేత సాక్షి మాలిక్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
పీవీ సింధు గురించి శోభా డే మాట్లాడుతూ.. "సింధు 24 క్యారెట్ల బంగారం.. నిజమైన హీరో అని వుయ్ లవ్ యూ'' అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగని శోభా భారత్‌కు పతకాలు సాధించిన సింధు, సాక్షిలపై ప్రశంసలు కురిపించాడు. సింధూ రియల్ లైఫ్‌ను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తున్నట్లు ఆమె మనసులో మాట బయటపెట్టారు. ఈ సినిమాలో దీపికా పదుకుణె ముఖ్య పాత్ర నటించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.