Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sania Mirza: జిఎస్‌టికి ఎనిమిదేళ్లు: సండేస్ ఆన్ సైకిల్‌కు మద్దతిచ్చిన సానియా మీర్జా

Advertiesment
Sania Mirza

సెల్వి

, శనివారం, 17 మే 2025 (22:22 IST)
సండేస్ ఆన్ సైకిల్‌కు ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత సానియా మీర్జా మద్దతు ప్రకటించారు. మే 18న జిఎస్‌టి ఎనిమిదేళ్లను పురస్కరించుకుని 'సండేస్ ఆన్ సైకిల్'కు మద్దతు ఇచ్చిన అనేక మంది ప్రముఖులలో ఒకరిగా నిలిచింది. 
 
ఈ కార్యక్రమం సిబిఐసి-గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) విభాగం సహకారంతో నిర్వహించబడుతోంది. దేశంలోనే అతిపెద్ద సైక్లింగ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 200 సీబీఐసీ-జీఎస్టీ కేంద్రాలతో సహా వివిధ ప్రదేశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షలాది మంది సైక్లింగ్ ఔత్సాహికులను ఫిట్‌నెస్, శ్రేయస్సు వైపు సమిష్టిగా ముందుకు తీసుకువెళుతుంది. 
 
సానియా మీర్జా, మిలింద్ సోమన్, సునీల్ శెట్టి, ఎమ్రాన్ హష్మి, ఇంతియాజ్ అలీ, జాన్ అబ్రహం, దారా సింగ్ మరియు శంకర్ మహదేవన్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో ఇందుకు మద్దతుగా నిలిచారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఫిట్‌నెస్, సైక్లింగ్ అంతర్భాగాలుగా ఉన్నాయని పునరుద్ధాటించారు. 
 
ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మాస్టర్, చెస్‌లో ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ అయిన తానియా సచ్‌దేవ్ ప్రత్యేక ప్రదర్శన ఇస్తారు. ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన 2024 చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు. యోగా, రోప్ స్కిప్పింగ్, జుంబా సెషన్‌లతో సహా కార్యకలాపాలతో పాటు 'పుష్-అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలువబడే రోహ్తాష్ చౌదరి కూడా ఆమెతో పాటు ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Neeraj Chopra: అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త రికార్డు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కితాబు