ప్లీజ్ సార్.. మీతో ఒక్క సెల్ఫీ తీసుకుంటాం.. సచిన్‌ను ప్రాధేయపడిన సాక్షి మాలిక్
సాక్షి మాలిక్. రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్. మహిళల రెజ్లింగ్ విభాగంలో ఆమె ఈ పతకాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు సాక్షి అంటే ఎవరో కూడా తెలియదు. కానీ
సాక్షి మాలిక్. రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్. మహిళల రెజ్లింగ్ విభాగంలో ఆమె ఈ పతకాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు సాక్షి అంటే ఎవరో కూడా తెలియదు. కానీ పతకం సొంతం చేసుకున్న మరుక్షణమే ఆమె పేరు కోట్లాది మంది భారతీయుల్లో మార్మోగిపోయింది.
అలాంటి సాక్షి మాలిక్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. ప్లీజ్..సార్.. మా సోదరుడితో కలిసి మీతో ఒక్క సెల్ఫీ తీసుకునేందుకు అనుమతివ్వండంటూ కోరింది. ఈ అరుదైన సంఘటన హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీలో జరిగింది.
రియో ఒలింపిక్స్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌లతో పాటు.. దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్), కోచ్ గోపీచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్లను బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బహుకరించారు. వీటి బహుకరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగగా, ఆ సమయంలో సచిన్‌ను సాక్షి మాలిక్ కోరింది.