ఇండోనేషియా మాస్టర్స్‌.. పెళ్లికి తర్వాత సైనా అదరగొట్టింది..

శనివారం, 26 జనవరి 2019 (17:27 IST)
ఇండోనేషియా మాస్టర్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. పెళ్లికి తర్వాత పాల్గొన్న తొలి టోర్నీలోనే సైనా సత్తా చాటింది. 
 
మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌లో ఆరోసీడ్‌ హే బిన్‌గ్జియావోతో తలపడిన సైనా ఘన విజయం సాధించింది. ఫలితంగా టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. 
 
హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను బిన్‌గ్జియావో 18-21 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా కాగా చైనా షెట్లర్ చెన్ యూఫే, స్పెయిన్‌ షట్లర్ కరోలినా మారిన్ మధ్య జరిగే మరో సెమీఫైనల్‌లో గెలిచిన విజేతతో సైనా ఫైనల్స్‌లో తలపడనుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కివీస్‌తో రెండో వన్డే.. 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం