Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియో పారా ఒలింపిక్స్‌‌లో భారత్‌కు రెండో స్వర్ణం.. జావెలిన్ త్రోలో దేవేంద్ర అదుర్స్

ప్రతిష్టాత్మక రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. దివ్యాంగులు పసిడి పతకాలతో దేశ పరువు ప్రతిష్ఠల్ని కాపాడుతున్నారు. ఇప్పటికే హైజంప్‌లో తమిళనాడు సేలంకు చెందిన మారియప్పన్ తొలి స్వ

Advertiesment
Rio Paralympics: India's Devendra Jhajharia wins gold in F-46 Javelin throw
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:29 IST)
ప్రతిష్టాత్మక రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. దివ్యాంగులు పసిడి పతకాలతో దేశ పరువు ప్రతిష్ఠల్ని కాపాడుతున్నారు. ఇప్పటికే హైజంప్‌లో తమిళనాడు సేలంకు చెందిన మారియప్పన్ తొలి స్వర్ణం సాధించగా.. జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియా రెండో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో మెరుగ్గా ఆడిన దేవేంద్ర జావెలిన్‌ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 
 
దీంతో గతంలో తన పేరిట ఉన్న62.15 మీటర్ల రికార్డు ప్రపంచ రికార్డుని కూడా బ్రేక్ చేశాడు. 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌లోనూ ఝఝారియా ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం రియోలోనూ తన సత్తా ఏంటో నిరూపించాడు. దేవేంద్ర సాధించిన పసిడి పతకం ద్వారా భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం వచ్చి చేరాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇకపోతే.. రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిన ఝుఝురియాకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను లక్ష్యం చేసుకుని పక్కనబెట్టారు.. పోరాటం ఆపను : గౌతం గంభీర్