Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రియోలో సంచలనం .. తొలి రౌండ్‌లోనే జకోవిచ్ - విలియమ్స్ అక్కాచెల్లెళ్ళ నిష్క్రమణ

రియో ఒలింపిక్స్ క్రీడల్లో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ తొలిరౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఈ రౌండ్‌లో డెల్‌పోట్రోతో తలపడిన జకొవిచ్‌ 7-6, 7-6తో ఓటమిపాలయ్యాడు. దీంతో జొకో రియో నుంచి

రియోలో సంచలనం .. తొలి రౌండ్‌లోనే జకోవిచ్ - విలియమ్స్ అక్కాచెల్లెళ్ళ నిష్క్రమణ
, సోమవారం, 8 ఆగస్టు 2016 (10:58 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ తొలిరౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఈ రౌండ్‌లో డెల్‌పోట్రోతో తలపడిన జకొవిచ్‌ 7-6, 7-6తో ఓటమిపాలయ్యాడు. దీంతో జొకో రియో నుంచి నిష్క్రమించాడు.
 
మ్యాచ్ అనంతరం జొకో మాట్లాడుతూ, డెల్‌పెట్రోను తక్కువ అంచనా వేశానని దానికి తగిన మూల్యం చెల్లించుకున్నట్టు చెప్పాడు. ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడం ఏ ఆటగాడికైనా బాధగానే ఉంటుందని, తాను కూడా చాలా బాధపడుతున్నట్లు వాపోయాడు. 
 
అలాగే, మహిళల డబుల్స్ విభాగంలో అమెరికాకు చెందిన విలియమ్స్ సోదరీమణులకు షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన బార్బోరా స్టికోవా, లుసియా సపరోవా చేతిలో 6-3, 6-4 తేడాతో చిత్తుగా ఓడిపోయి ఇంటిదారి పట్టారు. వీరిద్దరు కలిసి ఆడిన ఒలింపిక్స్ క్రీడల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ఈ జంట గత 2000, 2008, 2012లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న విషయ తెల్సిందే. 
 
మరోవైపు.. ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన శరణార్థుల జట్టుకు చెందిన సిరియా స్విమ్మర్‌ యుస్రా మర్దిని స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో తొలి హీట్‌ను 1:09:21 నిమిషాల్లో ముగించిన మర్దిని 41వ స్థానంలో నిలిచింది. 
 
దీంతో 18 ఏళ్ల మర్దిని తొలి హీట్‌లో గెలుపొందినా సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. టాప్‌-16లో నిలిచిన ప్లేయర్లే సెమీస్‌కు చేరేందుకు అర్హులు. ఇక ఈ నెల 10న జరిగే మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌ రూపంలో పతకం సాధించేందుకు మర్దినికి మరో అవకాశం ముందుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎందుకు ఓడిపోతున్నామో అర్థం చేసుకోండి.. విమర్శించొద్దు : సానియా మీర్జా