రియో ఒలింపిక్స్ 2016 గుడ్ విల్ అంబాసిడర్‌గా అభినవ్ బింద్రాను ఎంపిక చేశారు. నిజానికి ఈ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరును తొలుత ప్రకటించారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. క్రీడాకారులంతా విమర్శలు గుప్పించగా, బాలీవుడ్ నటీనటులు మాత్రం సల్మాన్ ఖాన్‌కు మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో... రియో ఒలింపిక్స్ 2016కు గుడ్ విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్‌ని తొలగించి అభినవ్ బింద్రా పేరును ఖరారు చేసింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఓ ప్రకటన చేసింది. మరోవైపు ఇండియన్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్ బృందంలో క్రికెటర్ సచిన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను చేర్చాలని భావిస్తోంది.