Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీని పక్కనబెట్టలేదు.. నా భార్య పేరెత్తకండి.. కుటుంబాన్ని లాగకండి: అశ్విన్

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనపై గల వివాదానికి చరమగీతం పాడాలనుకుంటున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న అశ్విన్‌కు సరికొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈ అవార్డుకు ఎంపిక కావడానికి టె

ధోనీని పక్కనబెట్టలేదు.. నా భార్య పేరెత్తకండి.. కుటుంబాన్ని లాగకండి: అశ్విన్
, సోమవారం, 26 డిశెంబరు 2016 (17:00 IST)
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనపై గల వివాదానికి చరమగీతం పాడాలనుకుంటున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న అశ్విన్‌కు సరికొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈ అవార్డుకు ఎంపిక కావడానికి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే, భార్య ప్రీతిలే ప్రధాన కారణమని పేర్కొన్న అశ్విన్.. పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో అశ్విన్ శైలిపై ధోని ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
ధోనీని పక్కనబెట్టేశాడని దుయ్యబట్టారు. దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. తాను ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తన ఉన్నతికి ధోనీ ఎంతో కృషి చేశాడని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు. ధోని తరువాత టెస్టు కెప్టెన్ బాధ్యతలను కోహ్లి చేపట్టాడు. దాంతో పాటు కొత్త కుర్రాళ్ల కల్గిన భారత జట్టు ఇప్పుడు ఉంది. ఆ క్రమంలోనే ఇప్పటి జట్టును ఉద్దేశించే మాత్రమే తాను ట్వీట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. 
 
తాను పెట్టిన ట్వీట్ ద్వారా ధోనీని పక్కనబెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నాడు. అవార్డులు తీసుకున్నప్పుడు కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తాంది. జట్టులోని కీలక సభ్యుల పేర్లను ప్రస్తావిస్తాం అదే పని తాను చేసినట్లు నెటిజన్లు గ్రహించాలని అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. అయితే నెటిజన్లకు అశ్విన్ మరొక విన్నపాన్ని కూడా చేశాడు. ఫన్నీ ట్వీట్లలో తన భార్య ప్రీతి ట్యాగును పేర్కొన్నవద్దంటూ విన్నవించాడు.
 
ఈ అనవసరపు రాద్దాంతంలో కుటుంబాన్ని లాగడం సబబు కాదని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే ధోనీ ఫ్యాన్స్ మాత్రం అశ్విన్ ట్వీట్ చేసినా చల్లారట్లేదు. ప్రస్తుత జట్టునే అశ్విన్ ట్వీట్ చేసివుంటే.. తన కెరీర్‌కు ఎంతగానో తోడ్పడిన ధోనీ గురించి ముందుగా చెప్పాక ఆపై ట్వీట్ చేసి వుండాలని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజహర్ అలీ అరుదైన రికార్డు.. క్యాలెండర్ ఇయర్‌లో 1000 రన్స్.. పాక్ నాలుగో ఆటగాడిగా?