Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింధును చూసీ చూసీ నాలో పెట్రోల్ ఖాళీ అయ్యింది... నెం.1 టార్గెట్ అన్న పీవీ సింధు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రజత పతకంతో సరిపెట్టుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న సింధు.. హైదరాబాదుకు చేరుకుంది. ఈ స

సింధును చూసీ చూసీ నాలో పెట్రోల్ ఖాళీ అయ్యింది... నెం.1 టార్గెట్ అన్న పీవీ సింధు
, మంగళవారం, 29 ఆగస్టు 2017 (16:33 IST)
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రజత పతకంతో సరిపెట్టుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న సింధు.. హైదరాబాదుకు చేరుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. జపాన్‌కు చెందిన ఒకుహరాతో జరిగిన ఫైనల్ పోరులో తాను విజయం కోసం తుదివరకు శ్రమించానని.. కాని తృటిలో టైటిల్ చేజార్చుకున్నానని తెలిపింది.
 
రజతం గెలిచినందుకు చాలా సంతోషంగా వుందని.. తన ప్రదర్శన ఎంతో ఆనందాన్నిచ్చిందని.. ఇదంతా కోచ్, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేసింది. అయితే ప్రపంచ నెంబర్ వన్ కావడమే తన ముందున్న లక్ష్యమని సింధు తెలిపింది. ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 
 
కాగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన పీవీ సింధుపై బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రశంసలు గుప్పించింది. ఫైనల్లో సింధూ ఆటతీరు అద్భుతమని, ఫైనల్లో తాను ఆడివుంటే కచ్చితంగా ఓడిపోయేదాన్నని తెలిపింది. సింధూ మ్యాచ్‌ని చూసీ చూసీ, తనలో పెట్రోల్ ఖాళీ అయిపోయిందని సైనా చెప్పుకొచ్చింది. సింధూను ప్రోత్సహిస్తూ తాను అలసిపోయానని సైనా కొనియాడింది. 
 
కాగా, సైనా నెహ్వాల్ వరల్డ్ చాంపియన్ షిప్ షటిల్ పోటీల్లో ఇండియాకు తొలి పతకాన్ని సాధించిన మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకోవడంపై ఆమె కోచ్ విమల్ కుమార్ వివరణ ఇచ్చారు. షెడ్యూల్‌ను టీవీ ప్రసారాలు ప్రభావితం చేసేలా ఉండకూడదని అన్నారు. ఇటువంటి మెగా ఈవెంట్లలో కచ్చితమైన షెడ్యూల్ పాటించాలని పేర్కొన్నారు. 
 
అర్థరాత్రి క్వార్టర్స్ ఆడిన సైనా తెల్లారి మళ్లీ సెమీస్‌లో ఆడడం వల్లే ఇలా జరిగిందని, మ్యాచ్‌కు సన్నద్ధం కావడానికి సమయం సరిపోలేదని విమల్ వివరించారు. షెడ్యూలింగ్‌కి పూర్తి బాధ్యత టెక్నికల్ అధికారులే వహించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిషేధం తర్వాత తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన మరియా షరపోవా