ఆసియా బ్యాడ్మింటన్: పీవీ సింధు- అజయ్ జయరాం గెలుపు.. సైనా ఓటమి
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ తొలి రౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. కానీ మరో షట్లర్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ఇండోనేషియా అన్‌సీడెడ్ క్రీడాకారిణ
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ తొలి రౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. కానీ మరో షట్లర్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ఇండోనేషియా అన్‌సీడెడ్ క్రీడాకారిణి దినార్ అయుస్టీన్‌పై 21-8, 21-18 తేడాతో గెలుపొందింది. తొలి సెట్‌ను సులభంగా గెలుచుకున్న సింధు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంది.
అయినప్పటికీ ప్రత్యర్థి షాట్లను ధీటుగా ఎదుర్కొన్న సింధు 31నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా తొలి రౌండ్లో జపాన్ క్రీడాకారిణి సయాక సాటో చేతిలో 21-19, 16-21, 18-21తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ టోర్నీ నుంచి సైనా నిష్క్రమించింది.
పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరాం 21-18, 18-21, 21-19తేడాతో చైనా క్రీడాకారుడు తియాన్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్-సిక్కిరెడ్డి జోడీ 15-21, 21-14, 16-21తేడాతో చైనా జోడీ జెంగ్-చెన్ చేతిలో పరాజయం పాలైంది.