ప్రొ కబడ్డీ లీగ్: ముంబైకి నిరాశ.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న పుణె!
ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో భాగంగా పుణె జట్టు సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ సత్తా చాటింది. దీంతో నాకౌట్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ
ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో భాగంగా పుణె జట్టు సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ సత్తా చాటింది. దీంతో నాకౌట్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పూణే విజయం సాధించడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ట్యాక్లింగ్‌లో మంజిత్ చిల్లర్ (11), రైడింగ్‌లో దీపక్ నివాస్ హుడా (9) ధీటుగా రాణించారు. వీరిద్దరూ ఆద్యంతం మెరుగ్గా రాణించడంతో సెమీస్ బెర్తును సొంతం చేసుకున్నట్లైంది.
మరో మ్యాచ్‌లో యు ముంబా 38-34తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందినా సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేకపోయింది. 42 పాయింట్లతో ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉన్నప్పటికీ.. ముంబై (18) స్కోరు ఓవరాల్‌గా పుణె (23) కంటే తక్కువగా ఉండటంతో పుణెకే సెమీస్ బెర్తు ఖాయమైంది.