పారాలింపిక్స్ 2024 విశ్వక్రీడల సంరంభం ప్రారంభమైంది. పారిస్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలతో మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారాలింపిక్ 2024ను ప్రారంభిస్తున్నట్టు గురువారం ప్రకటించారు.
ఫ్రాన్స్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా ఆరంభ వేడుకలను నిర్వహించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. కాగా, ప్రారంభం కార్యక్రమంలో 167 దేశాలకు చెందిన మొత్తం 4400 మంది పారాలింపియన్లు పాల్గొన్నారు. చాంప్స్-ఎలీసీస్ నుంచి ప్లేస్ డీ లా కాంకోర్డ్ మైదానం వరకు కవాతు చేశారు.
భారత్ బృందానికి పారా అథ్లెట్లు సుమిత్ యాంటిల్, భాగ్యశ్రీ జాదవ్ నాయకత్వం వహించారు. 12 విభిన్న క్రీడలలో 84 మంది అథ్లెట్లు ఈసారి భారత్ తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఒలింపిక్స్‌లో ఇంతపెద్ద సంఖ్యలో భారత పారా అథ్లెట్లు పాల్గొనడం చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, తొలు రోజున భారత అథ్లెట్లు పలు విభాగాల్లో తలపడుతున్నారు.