Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాహూ సర్వేలో టాప్‌లో నిలిచిన పీవీ సింధు.. మహిళా సెలెబ్రిటీల్లో సన్నీదే తొలిస్థానం..

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు యాహూ నిర్వహించిన సర్వేలో రాజకీయనాయకులను, బాలీవుడ్‌ నటులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సోషల్‌మీడియాలో అత్యధికంగా

Advertiesment
యాహూ సర్వేలో టాప్‌లో నిలిచిన పీవీ సింధు.. మహిళా సెలెబ్రిటీల్లో సన్నీదే తొలిస్థానం..
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (13:30 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు యాహూ నిర్వహించిన సర్వేలో రాజకీయనాయకులను, బాలీవుడ్‌ నటులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సోషల్‌మీడియాలో అత్యధికంగా శోధించిన పదం 'రియో ఒలింపిక్స్‌'కాగా తర్వాతి స్థానంలో 'ఐపీఎల్‌-2016' నిలిచింది. ఎక్కువగా వెదికిన మహిళా సెలెబ్రిటీల్లో తొలిస్థానాన్ని వరసగా ఐదో సంవత్సరం కూడా సన్నీలియోన్ నిలబెట్టుకుంది.
 
ఇక 2016లో దేశంలో వివిధ రంగాల్లో అత్యధికంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులపై నిర్వహించిన ఈ సర్వేలో పీవీ సింధు ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌ విభాగంలో తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 20లో సాక్షిమాలిక్ తదితర క్రీడాకారులు స్థానం సంపాదించారు. 
 
క్రికెటర్లను సైతం వెనక్కి ఇతర క్రీడల్లో రాణించిన ఆటగాళ్లు సర్వేలో ముందుకు దూసుకెళ్లారు. ఇక క్రికెటర్ల సంగతికి వస్తే టాప్‌ టెన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఎమ్‌ఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ స్థానం దక్కించుకున్నారు. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే... సోషల్‌మీడియాలో అత్యధికంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి ఎక్కువమంది శోధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండో స్థానంలో నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువీ.. భార్య నుంచి బౌన్సర్లు తప్పవ్.. చెస్ట్‌గార్డుల్లేవ్.. బీకేర్ ఫుల్.. నా టిప్స్ పాటించు: గంభీర్