Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీవి సింధు వెండి గెలుచుకున్న బంగారం... ఎస్ఎస్ రాజమౌళి జిజి రాజు ట్వీట్ పరిచయం...

నిజం. పీవీ సింధు రియో ఒలింపిక్ క్రీడల్లో ఉమెన్ సింగిల్ బ్యాడ్మింటన్ పోటీలో స్వర్ణం గెలుస్తుందని కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆమె ముందు నిలబడిన ప్రత్యర్థి ప్రపంచ నెం.1 క్రీడాకారిణి కేరొలీన మారిన్. ఆమెను తొలి సెట్లో మన సింధూ కంగార

Advertiesment
#PVSindhu
, శనివారం, 20 ఆగస్టు 2016 (12:52 IST)
నిజం. పీవీ సింధు రియో ఒలింపిక్ క్రీడల్లో ఉమెన్ సింగిల్ బ్యాడ్మింటన్ పోటీలో స్వర్ణం గెలుస్తుందని కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆమె ముందు నిలబడిన ప్రత్యర్థి ప్రపంచ నెం.1 క్రీడాకారిణి కేరొలీన మారిన్. ఆమెను తొలి సెట్లో మన సింధూ కంగారెత్తించింది. ఐతే ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను తన అద్భుతమైన ఆట తీరుతో విజయాన్ని తనవైపు తిప్పుకుంది కేరొలీన మారిన్. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఆమె నేల మీద బోర్లా పడుకుండిపోయింది. ఆనంద బాష్పాలతో భూమిపై తలపెట్టుకని అలా పడుకుంది. 
 
దీనిపై బ్లాగరు జిజి రాజుగారు చేసిన వ్యాఖ్యలను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పరిచయం చేశారు. జిజి రాజు ఏమన్నారంటే... పివి సింధు పరాజయంతో అందరికీ రెండు నిమిషాల బాధ కలిగి ఉండవచ్చు. తాము ఆశించినది దక్కలేదని. భారతీయులందరికీ బాధ. తెలుగువాళ్లకి ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు. టీవీ ముందు అలా కూర్చుండిపోయి ఉండొచ్చు. కానీ సింధుకి అంత సమయం కూడా పట్టలేదు కోలుకోవడానికి. నెట్ అవతలి పక్కకు వెళ్లింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకూ ఏ యూరోపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందంతో కన్నీరు కారుస్తున్న కేరొలీన్ మారిన్‌ని పైకి లేపి హత్తుకుంది. 
 
ఇది సహ అనుభూతి. ఇది తనపైన నెగ్గిన వారికి సింధు చూపిన గౌరవం, ఆప్యాయత. మారిన్ సింధుని కౌగలించుకుని ఆ విజయోత్సాహంలో తన కోచ్‌ల వద్దకు వెళ్లిపోయింది. తన రేకెట్ కోర్ట్ మీద మర్చిపోయి. సింధు ఆ రేకట్ తీసి, మారిన్ కిట్ బ్యాగు దగ్గర పెట్టి అప్పుడు తన గురువు దగ్గరకు వెళ్లింది. ఇది సంస్కారం. ఇదీ బంగారం. తల్లిదండ్రుల పెంపకం, గురువుల శిక్షణతో వచ్చేది, గవర్నమెంటు సంబరాలతో, శాసనాలతో ఉప్పొంగేది కాదు. సింధు ఏ దేశానిదో, రాష్ట్రానిదో అన్నది అనవసరం. ఇలాంటి బంగారం ఒకటుంది ప్రపంచంలో. అది మలచిన రమణ విజయలక్ష్మిలకు, గురువు గోపీచంద్‌కు నమస్కరిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్‌లో సింధూ ప్రతిభ అమోఘం : చాముండేశ్వరినాథ్‌