మహిళా రెజ్లర్ నిశా దహియా చనిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ, అదే రెజ్లర్ బంగారం పతకం సాధించింది. గురువారం ఉత్తరప్రదేశ్లో జరిగిన జాతీయ మహిళా రెజ్లింగ్ ఛాంపియన్పిష్లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. రైల్వేస్ తరపున బరిలో దిగిన ఈమె.. 65 కిలోల విభాగంలో పతకం దక్కించుకుంది.
ఇదిలావుంటే, బుధవారం హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నిశా చనిపోయిందనే వార్తలు వచ్చాయి. తాను జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనడంలో భాగంగా గోండాలో ఉన్నానని, తనకు ఏం కాలేదని వివరణ ఇచ్చింది.
పైగా, తాను మరణించానంటూ వస్తున్న అసత్య వార్తలను కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.