అండర్ 20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మీట్‌లో భారత్ రెండో మెడల్ తన ఖాతాలో వేసుకుంది. కెన్యాలోని నైరోబీలో జరుగుతున్న ఈ గేమ్స్‌లో శనివారం భారత అథ్లెట్ అమిత్ ఖాత్రి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 10km రేస్ వాక్ ఈవెంట్‌లో దేశానికి ఈ పతకం దక్కింది. 42 నిమిషాల 17.94 సెకన్ల రేస్ పూర్తి చేసిన అమిత్ రెండో స్థానంలో నిలిచాడు. కేవలం 7.1 సెకన్ల గ్యాప్‌లో అమిత్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ గేమ్స్‌కు ఆతిథ్య దేశమైన కెన్యా.. 10km రేస్ వాక్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. కెన్యాకు చెందిన అథ్లెట్ హెరిస్టోన్ వన్యోని 42 నిమిషాల 10.84 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 42 నిమిషాల 26.11 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిన స్పెయిన్‌కు చెందిన అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.