నెదర్లాండ్స్‌కు చెందిన టీనేజర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 18 ఏళ్ల 228 రోజుల్లో ఎఫ్-1 రేసు విజేతగా నిలిచాడు. ఈ మధ్యే టోరో రోసో నుంచి రెడ్‌బుల్‌కు మారిన వెర్‌స్టాపెన్ ఆదివారం స్పానిష్ గ్రాండ్ ప్రి రేసును కైవసం చేసుకున్నాడు. ఇది అతడికి 24వ ఎఫ్-1 రేసు మాత్రమేనని.. వెటెల్ 21 ఏళ్ల 74 రోజులకు ఎఫ్-1 ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం.
సహారా ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఏడో స్థానంలో నిలిచి.. జట్టుకు ఆరు పాయింట్లు సాధించి పెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఎఫ్-1 రేసు గెలిచిన రేసర్‌గా సెబాస్టియన్ వెటెల్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ అయ్యింది.
కాగా మ్యాక్స్ వెర్‌స్టాపెన్ అగ్రస్థానంలోనూ, కిమి రాయ్‌క్కొనేన్, సెబాస్టియన్ వెటల్, డేనియల్ రిక్కార్డో, బొటాస్, కార్లోస్ సైన్, ఫెలిప్పే మాస్సా, జెన్సన్ బుటన్, డానిల్ కివయాత్ టాప్-10లో నిలిచారు.