Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరియా షరపోవాపై రెండేళ్ల పాటు నిషేధం.. మెల్డోనియం డ్రగ్ అని తెలియదు.. అప్పీలుకు?

మరియా షరపోవాపై రెండేళ్ల పాటు నిషేధం.. మెల్డోనియం డ్రగ్ అని తెలియదు.. అప్పీలుకు?
, గురువారం, 9 జూన్ 2016 (09:15 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టెన్నిస్ తార మరియా షరపోవాపై రెండేళ్ల నిషేధం పడింది. బుధవారం ఆ పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. నిషేధిత మెల్డోనియం అనే డ్రగ్‌ను ఆమె ఉపయోగించినట్లు తేలడంతో టెన్నిస్ సమాఖ్య ఆమెపై రెండేళ్ళ నిషేధం విధించింది.  
 
ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకుని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు అభిమానులను సంపాదించుకున్న ఈ టెన్నిస్ తారపై డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య గత మార్చిలో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 
అయితే టెస్టు ఫలితాలు పాజిటివ్‌గా రావడంతో ప్రస్తుతం రెండేళ్ల పాటు నిషేధం విధించారు. అయితే, మెల్డోనియం నిషేధిత డ్రగ్ అని తనకు తెలియదని షరపోవా వాదించింది. నిషేధం విషయంపై మరోసారి పరిశీలించాలని టెన్నిస్ సమాఖ్యను కోరింది. దీనిపై అప్పీలు చేయాలని షరపోవా అనుకుంటున్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్నెళ్ల తర్వాత హానీమూన్‌కు రోహిత్ దంపతులు.. కాప్రి అందాలు మత్తెక్కిస్తున్నాయట!