Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్నెళ్ల తర్వాత హానీమూన్‌కు రోహిత్ దంపతులు.. కాప్రి అందాలు మత్తెక్కిస్తున్నాయట!

ఆర్నెళ్ల తర్వాత హానీమూన్‌కు రోహిత్ దంపతులు.. కాప్రి అందాలు మత్తెక్కిస్తున్నాయట!
, బుధవారం, 8 జూన్ 2016 (16:38 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, రితిక సజదేహ్‌ను గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. వరుస టోర్నమెంట్లతో తీరిలేకుండా గడిపిన రోహిత్‌కి ఎట్టకేలకు విశ్రాంతి దొరికింది. దీంతో యూరప్‌లోని కాప్రిలో హనిమూన్ ప్లాన్ చేసుకున్నాడు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న భార్య‌తో యూరప్‌లోని కాప్రిలో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. బిజీ జీవితంలో ఇప్పుడే తనకు సమయం చిక్కిందని, అంతేకాకుండా మేం ప్రయాణించిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానంలో అన్ని సౌకర్యాలున్నాయని రోహిత్ సోష‌ల్ మీడియాలో తెలిపాడు. 
 
లాంగ్ జర్నీ చేసి రోమ్‌లో దిగామంటూ ఎతిహాద్ ఎయిర్ వేస్ సిబ్బంది సేవలు తమకు బాగా నచ్చాయని పేర్కొన్నాడు. అక్కడ కాప్రి అందాలు మత్తేక్కిస్తున్నాయంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియా కోచ్‌పై స్పందించిన కెప్టెన్ ధోనీ.. భాషతో సంబంధమేముంది..?