ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి భారతదేశానికి చెందిన కోనేరు హంపి రెండవ ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.
హంపి 2019లో జార్జియాలో జరిగిన ఈ ఈవెంట్‌ను గెలుచుకుంది. తద్వారా చైనాకు చెందిన జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 37 ఏళ్ల హంపి 11 పాయింట్లలో 8.5 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించింది.
ఈ సందర్భంగా హంపి మాట్లాడుతూ.. తాను ఎంతో సంతోషంగా వున్నానని.. నిజానికి, ఇది చాలా కఠినమైన రోజు అవుతుందని అనుకున్నాను.. కానీ టైటిల్ గెలిచే రోజుగా నిలిచిందని హంపి తెలిపింది. ఇటీవల సింగపూర్‌లో జరిగిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డి గుకేష్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్‌గా హంపి నిలిచింది.