రాజకీయాల్లోకి రావట్లేదు.. జనసేన-టీఆర్ఎస్‌ల్లో చేరట్లేదు: గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్‌లో గ్లామర్ క్రీడాకారిణిగా.. డబుల్స్ విభాగంలో రాణిస్తూనే.. ఏ విషయాన్నైనా బోల్డ్‌గా చెప్పేయడంలో ఏమాత్రం జంకని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ప్రస్తుతం భాగస్వామికి విడాకులిచ్చి.. తన
బ్యాడ్మింటన్‌లో గ్లామర్ క్రీడాకారిణిగా.. డబుల్స్ విభాగంలో రాణిస్తూనే.. ఏ విషయాన్నైనా బోల్డ్‌గా చెప్పేయడంలో ఏమాత్రం జంకని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ప్రస్తుతం భాగస్వామికి విడాకులిచ్చి.. తన పనేంటో తాను చేసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల రాజకీయ అరంగేట్రం చేయనుందని టాక్ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు గుత్తా జ్వాలా సుముఖంగా ఉందని.. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత, టి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవితతో సన్నిహితంగా మెలుగుతున్నారని జోరుగా ప్రచారం సాగింది.
ఇంకా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను గుత్తా జ్వాలా ప్రశంసించడం ద్వారా జనసేనలో చేరే ఛాన్సుందని కూడా వార్తలొచ్చాయి. ఇవన్నీ పుకార్లేనని.. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని గుత్తా జ్వాలా స్పష్టం చేశారు.
తాను స్టార్ కాంపెనర్‌ను కూడా కానని.. తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని గుత్తా వివరణ ఇచ్చింది. రాజకీయాలంటే ఇష్టమని మాత్రమే చెప్పాను కానీ.. రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదంటూ గుత్తా జ్వాలా స్పష్టం చేసింది.