ఐఎస్ఎల్ ప్రారంభ మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కాతా, ముంబై సిటీ ఎఫ్‌సి మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత ఫుట్‌బాల్‌లో నవశకానికి నాంది పలుకుతుందని క్రీడాపండితుల విశ్లేషణ. ఐఎస్‌ఎల్‌లో 8 ఫ్రాంచైజీ జట్లు బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా, గౌహతి, కొచ్చిన్, గోవా, పుణె, చెన్నై, ముంబై, ఢిల్లీ వేదికలుగా 61 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి.
ప్రారంభ కార్యక్రమం కోల్‌కాతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్, గంగూలీ, బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం ప్రారంభ వేడుకలకు స్టార్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. 8 టీమ్‌లు భారత సంస్కృతిని ప్రతిబింభించే విధంగా 8 దేశీ రిథమ్‌లను ప్రదర్శించనున్నాయి.