Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ప్రజలకు ఆగస్టు 15న కానుక ఇవ్వాలనుకున్నా.. సారీ : క్రిషన్ యాదవ్

భారత ప్రజలకు ఆగస్టు 15న కానుక ఇవ్వాలని గట్టిగా భావించాను, కానీ, కుదరలేదు అని 24 ఏళ్ల హర్యానా బాక్సర్ క్రిషన్ యాదవ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ ఫెడరేషన్ - అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య విభేదాల నేపథ్యంలో

భారత ప్రజలకు ఆగస్టు 15న కానుక ఇవ్వాలనుకున్నా.. సారీ : క్రిషన్ యాదవ్
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (12:33 IST)
భారత ప్రజలకు ఆగస్టు 15న కానుక ఇవ్వాలని గట్టిగా భావించాను, కానీ, కుదరలేదు అని 24 ఏళ్ల హర్యానా బాక్సర్ క్రిషన్ యాదవ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ ఫెడరేషన్ - అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య విభేదాల నేపథ్యంలో తమకు అంతర్జాతీయంగా తగిన శిక్షణ లభించలేదని వాపోయాడు. 
 
భారీ ఆశలతో రియో అడుగుపెట్టిన భారత బాక్సర్లు పెట్టెబేడా సర్దుకొని ఇంటిముఖం పట్టారు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ కూడా క్వార్టర్ ఫైనల్‌లో చతికిలపడ్డాడు. 75 కిలోల మిడిల్ వెయిట్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమెర్ మెలికుజీవ్ చేతిలో 0-3 తేడాతో క్రిషన్ యాదవ్ చిత్తుగా ఓడిపోయాడు.
 
దీనిపై స్పందిస్తూ ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడితో తలపడిన క్రిషన్.. క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయి.. ఉట్టిచేతులతో స్వదేశానికి వస్తుండటం తీవ్ర నిరాశకులోను చేసింది. దీంతో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. 'మన బాక్సింగ్ ఫెడరేషన్‌పై నిషేధం విధించారు. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మంచి బాక్సర్ల్ నేతృత్వంలో మేం శిక్షణ పొందలేకపోయాం. అయినా నేను ఎవరినీ నిందించడం లేదు. నా కారణంగానే నేను ఓడిపోయాను. పతకాన్ని గెలువలేకపోయాను క్షమించండి' అంటూ క్రిషన్ పేర్కొన్నాడు. కాగా, ఇప్పటికే భారత బాక్సర్లు శివ థాప (56 కిలోలు), మనోజ్ కుమార్ (64 కిలోలు) ఇంటిముఖం పట్టడంతో బాక్సింగ్‌లో భారత పోరు ముగిసిపోయింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న హైదరాబాదీ కుర్రాడు శ్రీకాంత్.. పతకం సాధిస్తాడా?