Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశపు నూతన ఈ-స్పోర్ట్స్ ఛాంపియన్‌లకు పట్టం కట్టడానికి తిరిగివచ్చిన TEGC 2023

Advertiesment
image
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (21:21 IST)
నూతన ఈ స్పోర్ట్స్ ఛాంపియన్‌లకు పట్టం కట్టేందుకు తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్ (TEGC) 2023 భారతదేశానికి తిరిగి వచ్చింది. భారతదేశంలో సుదీర్ఘ కాలంగా నిర్వహించబడుతున్న ఈ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌‌గా వెలుగొందుతున్న TEGC కు 2023లో 10 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సారి ఈ పోటీలను మరింత పెద్దగా నిర్వహించనుంది. ఇటీవలనే తైవాన్ ఎక్సలెన్స్ (TE) ఎలిమినేషన్ రౌండ్‌ల వివరాలను, గ్రాండ్ ఫినాలే మరియు ఈ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
 
ఈ సంవత్సరం ఈ కార్యక్రమం, మొదటిసారిగా, భారతదేశం నుండి మాజీ TEGC ఛాంపియన్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి TEGC ఇప్పటికే ప్రముఖ టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది TE YouTube హ్యాండిల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్పోర్ట్స్‌లో మహిళల అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ, TEGC భారతదేశంలోని టాప్ 10 మహిళా గేమర్‌ల మధ్య ఆసక్తికరమైన పోటీని నిర్వహించే ప్రణాళికలను సైతం ప్రకటించింది. నవంబర్‌లో జరగాల్సిన TEGC గ్రాండ్ ఫినాలే సమయంలోనే ఈ యుద్ధం జరుగుతుంది.
 
TEGC యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ముంబై లోని తైపీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లైజన్ ఆఫీస్ డైరెక్టర్ (TAITRA- ముంబై) శ్రీ పోయి ఎడిసన్ హెసు మాట్లాడుతూ, “ఈ స్పోర్ట్స్ అంటే కేవలం గేమింగ్ మాత్రమే కాదు, అది ఒక అభిరుచి, ఒక వృత్తి మరియు ఈ దేశంలోని కొన్ని ప్రకాశవంతమైన మనస్సులకు జీవన విధానం” అని అన్నారు. "తొలిసారిగా జరిగిన పోటీలో 500 మంది పాల్గొంటే, TEGC 10వ ఎడిషన్‌తో 25,000 మంది యువ భారతీయ గేమర్‌లు ఛాంపియన్‌గా పోరాడతారని అంచనా వేయడం జరిగింది" అని శ్రీ ఎడిసన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ ఫుట్‌బాల్.. జ్యోతిష్యుడి సలహా మేరకు జట్టు ఎంపిక.. ఆపై?