హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో చాటుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫ
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో చాటుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 18-21, 21-9, 21-16 పాయింట్ల తేడాతో 11వ ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి సయాకా శాటోపై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
తొలిగేమ్‌ను కోల్పోయినా.. మిగిలిన రెండు సెట్లలో మెరుగ్గా రాణించింది. ఆద్యంతం ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా సైనాను విజయం వరించింది.
ఫలితంగా రియో ఒలింపిక్స్ తర్వాత గాయం నుంచి కోలుకున్న సైనా నెహ్వాల్ తన ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు ప్రణయ్ 21-15, 11-21, 15-21 తేడాతో చాంగ్ వుయ్ ఫెంగ్(మలేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
కానీ, సమీర్ వర్మ ప్రి-క్వార్టర్స్‌లో విజయం సాధించాడు. సమీర్ 19-21, 21-15, 21-11 తేడాతో కజుమసా సాకాయ్(జపాన్)పై గెలిచాడు. తద్వారా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.