Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌ : మెరిసిన గుర్జంత్, సిమ్రన్‌జిత్.. జగజ్జేతగా భారత

యువ హాకీ జట్టు కుర్రోళ్లు అదరగొట్టారు. స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌లో జైతయాత్ర కొనసాగిస్తూ భారత్ జగజ్జేతగా నిలిచింది. అద్భుత ప్రదర్శనతో 15 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి ట్రోఫీని ముద్దా

Advertiesment
Hockey Junior World Cup 2016
, సోమవారం, 19 డిశెంబరు 2016 (13:03 IST)
యువ హాకీ జట్టు కుర్రోళ్లు అదరగొట్టారు. స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌లో జైతయాత్ర కొనసాగిస్తూ భారత్ జగజ్జేతగా నిలిచింది. అద్భుత ప్రదర్శనతో 15 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌లో టీమిండియా పసిడి పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గుర్జంత్ సింగ్‌, సిమ్రన్‌జిత్ సింగ్‌ మెరుపు గోల్స్‌తో టైటిల్‌ ఫైట్‌లో భారత్ 2-1తో బెల్జియంను ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
 
ఈ టోర్నీ గ్రూప్‌ దశ నుంచి హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేస్తూ వచ్చిన భారత ఆటగాళ్లు నాకౌట్‌లోనూ దుమ్మురేపారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన కుర్రాళ్లు టైటిల్‌ ఫైట్‌లోనూ అదే జోరు కొనసాగించారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తుది పోరులో భారత్ 2-1తో బెల్జియంను చిత్తు చేసి.. టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచారు. తద్వారా టైటిల్‌ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. 
 
గుర్జంత్ సింగ్‌, సిమ్రన్‌జిత్ సింగ్‌ చెరో గోల్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీని ఓడించి తొలిసారి ఫైనల్‌ చేరిన బెల్జియం రజత పతకంతో సరిపెట్టుకుంది. కాగా, కాంస్య పతకం కోసం జరిగిన పోరులో జర్మనీ 3-0తో ఆస్ట్రేలియాపై గెలిచింది. కాగా, ఈ మెగా టోర్నీలో 1997లో భారత రన్నరప్‌ ట్రోఫీ దక్కించుకుంది. తర్వాత 2001లో తొలిసారి విజేతగా నిలిచింది. ఇక రెండోసారి విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. భారత్ కంటే ముందు జర్మనీ రెండుసార్లు టైటిల్‌ గెలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంచలన విజయం... మూడో రౌండ్‌కే ప్రత్యర్థి ఔట్