Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతా పోగట్ పునరాగమనం.. శిక్షణతో ఒత్తిడి మటాష్..

ప్రొ రెజ్లింగ్ లీగ్‌తో రెజ్లర్ గీతా పోగట్ పునరాగమనం చేయనుంది. గాయం కారణంగా పోగట్ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. చాలా రోజుల తర్వాత మ

Advertiesment
Geeta Phogat says pressure of making comeback nothing compared to childhood rigours
, బుధవారం, 28 డిశెంబరు 2016 (09:41 IST)
ప్రొ రెజ్లింగ్ లీగ్‌తో రెజ్లర్ గీతా పోగట్ పునరాగమనం చేయనుంది. గాయం కారణంగా పోగట్ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. చాలా రోజుల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతుండడం ఆమెకు కాస్త ఒత్తిడి కలిగిస్తుండొచ్చునని క్రీడా పండితులు అంటున్నారు. అయితే తాము కఠిన శిక్షణ పొందామని అంటున్నారు. ఈ శిక్షణ ముందు ఒత్తిడితో పని లేదని, లెక్కలేదని పోగట్ వెల్లడించింది. 
 
ఎన్నోసార్లు అఖాడా నుంచి పారిపోదామనుకున్నా.. కానీ ప్రస్తుతం శిక్షణ కారణంగా ఫలితం దక్కుతోందని, దాని విలువను అర్థం చేసుకున్నామని వివరించింది.
 
''సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేస్తున్నందున నేను కాస్త ఒత్తిడి ఎదుర్కొంటున్నా. కానీ ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నా బలమైన మూలాలే అందుకు కారణం. ఎప్పుడూ నేను శిక్షణకు వెనుకాడలేదు'' అని గీతా పోగట్‌ చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. స్టీవ్ స్మిత్‌కు వరించని కెప్టెన్సీ