Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కారు కోసం రోడ్లు బాగు చేస్తున్న త్రిపుర సర్కారు

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరపున జిమ్నాస్టిక్ క్రీడల్లో పాల్గొన్న దీపా కర్మాకర్‌ కోసం త్రిపుర ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు ఆగమేఘాలపై చేస్తోంది. ఈమెకు బహుకరించిన బీఎండబ్ల్యూ కారు తిరిగేందుకు వీలుగా

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కారు కోసం రోడ్లు బాగు చేస్తున్న త్రిపుర సర్కారు
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:35 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరపున జిమ్నాస్టిక్ క్రీడల్లో పాల్గొన్న దీపా కర్మాకర్‌ కోసం త్రిపుర ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు ఆగమేఘాలపై  చేస్తోంది. ఈమెకు బహుకరించిన బీఎండబ్ల్యూ కారు తిరిగేందుకు వీలుగా ఈ రోడ్లను రిపేరు చేస్తున్నారు. 
 
రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రముఖ షట్లర్ పీవీ సింధు, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్‌తో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు కానుకగా బీఎండబ్ల్యూ కార్లను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బహూకరించిన విషయం విదితమే. అయితే, రోడ్లు సరిగా లేకపోవడంతో కారులో ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉందని, తిరిగి ఆ కారును ఇచ్చివేసి, అందుకు సరిపడ డబ్బును తీసుకుని స్థానికంగా లభించే ఒక కారును కొనుగోలు చేసుకోవాలని దీపా కర్మాకర్ కుటుంబం భావించినట్టు ఇటీవల మీడియాలో వార్తలొచ్చిన సంగతి విదితమే. 
 
అయితే, ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం మండిపడుతున్నారు. రోడ్లు సరిగా లేవన్న కారణంతో కానుకగా వచ్చిన కారును తిరిగి ఇచ్చివేయాలన్న ఆలోచన సరైనది కాదనీ, ఆ విధంగా చేస్తే తమ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు అనుకున్నారు. దీంతో, కర్మాకర్ నివాసానికి దగ్గర, సమీపంలోని రోడ్లను బాగు చేస్తున్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇంజనీర్ సోమేష్ చంద్రదాస్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటూ తొమ్మిదో తరగతి పరీక్షల్లో ప్రశ్న... విస్తుపోయిన స్టూడెంట్స్