సీఆర్పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు: రూ.2కోట్లకు బ్రాండ్ వాల్యూ
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బ్రాండ్ వాల్యూ ఓ వైపు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. పీవీ స
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బ్రాండ్ వాల్యూ ఓ వైపు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. పీవీ సింధుకు కమాండెంట్ ర్యాంకుతో గౌరవించడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సీఆర్పీఎఫ్ నిర్ణయించింది.
సింధుకు సమాచారమిచ్చిన అధికారులు ఆమె అంగీకారంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదించారు. అనుమతి రాగానే ఆమెకు ఎస్పీతో సమానమైన కమాండెంట్ ర్యాంకును ప్రజానం చేయడంతో పాటు సీఆర్పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారు.
ఇదిలా ఉంటే.. పీవీ సింధు బ్రాండ్ వాల్యూ బాగా పెరిగిపోతోంది. రియో ఒలింపిక్స్‌లో విజయం తర్వాత సింధు బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా..సింధు బ్రాండ్ విలువ 20 లక్షల నుంచి రెండు కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఇంత బ్రాండ్ విలువను తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రీడాకారులూ సాధించలేదని క్రీడా పండితులు అంటున్నారు.