కొలరొడో రాజధాని డెన్వర్‌లో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ (యుఎఫ్‌సి) టోర్నీలో మెరుపు వేగంతో ఓ ప్లేయర్ తలరాతే మారిపోయింది. అదీ కూడా ఒక్క సెకనులో ఒక్క పంచ్‌తో అతని రాతమారిపోయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్‌లోని పెప్సీ సెంటర్‌లో సౌత్ కొరియా ప్లేయర్ చాన్ సంగ్ జంగ్, మెక్సికోకు చెందిన యాయిర్ రోడ్రి గుజేల మధ్య యూఎఫ్‌సీ నైట్-139 ఫైట్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మొత్తం 25 నిమిషాల గేమ్‌లో చివరి నిమిషం దాకా ఉత్కంఠగా సాగింది.
కానీ, చివరి నిమిషంలో 'కొరియన్ జాంబీ'గా పేరున్న చాన్.. రోడ్రిగుజేపై పిడిగుద్దులు గుప్పించాడు. చాన్ దెబ్బలకి రోడ్రిగుజే ముఖం మొత్తం రక్తసిక్తమైంది. ఆట మరో సెకనులో ముగుస్తుందనగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రోడ్రిగుజే ఇచ్చిన ఎల్బో(మోచేయి) షాట్‌తో చాన్ కుప్పకూలిపోయాడు. దీంతో రోడ్రిగుజే 'ఫైట్ ఆఫ్ ది నైట్' విన్నర్ అయ్యాడు.