Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీవీ సింధుకు అన్ని డబ్బులు ఇచ్చారా? బిత్తరపోయిన కరొలినా మారిన్

ఒలింపిక్ బ్యాండ్మింటన్ విమెన్ సింగిల్స్‌లో పీవీ సిందును ఓడించి స్వర్ణ పతకం సాధించిన స్పానిష్ క్రీడాకారిణి కరోలినా మారిన్ రజత పతకం గెల్చుకున్న పీవీ సింధుకు వచ్చిన నగదు అవార్డుల గురించి విని బిత్తరపోయింది.

Advertiesment
Carolina Marin
హైదరాబాద్ , శుక్రవారం, 13 జనవరి 2017 (07:21 IST)
ఒలింపిక్ బ్యాండ్మింటన్ విమెన్ సింగిల్స్‌లో పీవీ సిందును ఓడించి స్వర్ణ పతకం సాధించిన స్పానిష్ క్రీడాకారిణి కరోలినా మారిన్ రజత పతకం గెల్చుకున్న పీవీ సింధుకు వచ్చిన నగదు అవార్డుల గురించి విని బిత్తరపోయింది. ఒలింపిక్ క్రీడల్లో సిల్వర్ మెడల్ గెల్చుకున్న తొలి మహిళా షట్లర్ సింధును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు, రివార్డులతో ముంచెత్తాయి. కానీ సింధును ఓడించి గోల్డ్ మెడల్ సాదించిన మారిన్‌కి స్పెయిన్ దేశం ఇచ్చిన నగదు బహుమతి 70 లక్షల రూపాయలు మాత్రమేనట.
 
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన కరోలినా మారిన్ ఇటీవల ఢిల్లీలో ఓ ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ పీవీ సింధుకు కోట్లాది రూపాయల నజరానాలు ఇచ్చారని విన్నాను. అది చాలా భారీ మొత్తం. నాకయితే స్పానిష్ ప్రభుత్వం అతి కొద్ది మాత్రాన్ని మాత్రమే ఇచ్చింది అని మారిన్ తెలిపింది. 
 
సింధు పొందిన నగదు మొత్తంలో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే నాకు దక్కింది.  కాని భారత్‌లో క్రీడలకు చాలా ప్రజాదరణ ఉందనటానికి ఇది సూచిక. స్పెయిన్‌లో అయితే కొన్ని ప్రాంతాల్లోనే బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం ఉంది. అక్కడ సైతం భారత్‌లో ఉన్నంత క్రేజ్ ఉండదు. అంటే బ్యాడ్మింటన్‌ను  వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి భారతదేశం ఒక నమూనాగా ఉందన్నమాటే అని మారిన్ తెలిపింది. 
 
అదే సింధు విషయంలో అయితే పలు బ్రాండ్ కంపెనీలు సంప్రదించాయి. ఒలెంపిక్ క్రీడల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సింధు ఒక్కరాత్రిలో జాతీయ ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు ఆమెకు 13 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించాయి. పైగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ తరపున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆమెకు విలాసవంతమైన కారును సమర్పించాడు. వీటితో పాటు రానున్న మూడేళ్ల కాలంలో వివిధ కంపెనీల నుంచి 50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేసినట్లు సమాచారం.
 
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ రెండో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్‌ తరపున కరోలినా మారిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపార్ట్‌మెంట్ పరిశీలించిన కోహ్లీ, అనుష్క జంట.. పెళ్లైన తర్వాత ఇక్కడే కాపురం పెడతారా?