Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిట్‌నెస్‌పైనే గెలుపోటములు ఆధారపడి వుంటాయ్: సైనా నెహ్వాల్

Advertiesment
Saina Nehwal
, శుక్రవారం, 24 జులై 2015 (19:41 IST)
ఆటలో ఫిట్‌నెస్ చాలా ముఖ్యమైనదని, ఫిట్‌గా లేకుంటే విజయాలు సాధ్యం కాదని బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేర్కొంది. సైనా వరల్డ్ నెంబర్ టూ ర్యాంకులో కొనసాగుతున్న సైనా నెహ్వాల్... గెలుపు, ఓటములు ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. 
 
ప్రపంచ ఛాంపియన్ షిప్ సహా ఇతర టోర్నీలకు సన్నద్ధమవుతున్న సందర్భంగా సైనా మాట్లాడుతూ, శారీరక దృఢత్వంపైనే విజయాలు, పరాజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పింది. త్వరలో జరుగనున్న టోర్నీల్లో విజయం సాధించేందుకు ఫిటినెస్‌పై దృష్టి పెట్టానని తెలిపింది. మెరుగైన ఆటతీరుతో విజయం సాధించేందుకు శక్తి వంచనలేకుండా సాయశక్తులా కృషి చేస్తానని సైనా వెల్లడించింది.
 
ప్రస్తుతం బెంగళూరులోని అకాడమీలో పూర్తిగా శిక్షణ తీసుకుంటున్నానని, తన ప్రదర్శనపైనే పూర్తిగా దృష్టిసారించానని సైనా చెప్పింది. మెరుగైన ఆటతీరు కోసం కోచ్ తనకు శిక్షణ ఇస్తున్నట్లు సైనా తెలిపింది. ఏప్రిల్‌లో బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టాప్‌లో నిలిచి రికార్డు సృష్టించిన సైనా.. అదే స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu