Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ ఖాతాలో మరొకటి.. అమిత్ పంఘాల్ పంచ్‌కు స్వర్ణం

భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో స్వదేశానికి చెందిన అమిత్ పంఘాల్ విజేతగా నిలిచాడు. ఫలితంగ

Advertiesment
భారత్ ఖాతాలో మరొకటి.. అమిత్ పంఘాల్ పంచ్‌కు స్వర్ణం
, శనివారం, 1 సెప్టెంబరు 2018 (13:31 IST)
భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో స్వదేశానికి చెందిన అమిత్ పంఘాల్ విజేతగా నిలిచాడు. ఫలితంగా బంగారు పతకం వరించింది.
 
ఈ పోటీ ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హసన్‌బోయ్‌ దుస్మతోమ్‌పై విజయం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో ఫైనల్‌ చేరిన ఏకైక భారత బాక్సర్‌ అమితే కావడం గమనార్హం. 
 
2016 రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత దుస్మతోమ్‌పై విజయం సాధించడంతో అమిత్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హర్యానాకు చెందిన అమిత్‌ ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించాడు. ఆ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 14వ స్వర్ణం. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 66 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 14 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్యాలు ఉన్నాయి. 
 
కాగా, ఇప్పటివరకు జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 2010లో 65 పతకాలను గెలుచుకుంది. వీటిలో 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలు ఉన్నాయి. తాజా ఆసియా క్రీడల్లో భారత్‌ గత రికార్డును తిరగరాసి 66 పతకాలతో ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్- సచిన్ రికార్డ్ బ్రేక్.. 6000 పరుగులతో కోహ్లీ అదుర్స్