Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను దారుణంగా పొడిచి చంపిన వెనిజులా బాక్సర్..!!

Advertiesment
క్రీడలు
FILE
వెనిజులా బాక్సింగ్ ఛాంపియన్ ఎడ్విన్ వలేరో, తన భార్య జెన్నిఫర్ కరోలినా వైరా డే వలేరోను దారుణంగా పొడిచి హత్య చేసినట్లు పోలీసులు, జుడీషియల్ అధికారులు సోమవారం సాయంత్రం వెల్లడించారు. దీంతో హత్యా నేరంకింద అతడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

అటార్నీ జనరల్ అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. వాలెన్సియాలోని ఇంటర్‌కాంటినెంటల్ హోటల్‌లో రాత్రిపూట తన భార్య జెన్నిఫర్‌ (24) ను హత్య చేసినట్లు 28 సంవత్సరాల వలేరో స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు ఆ ప్రకటన తెలిపింది.

భార్యను హత్య చేసిన అనంతరం నేరుగా హోటల్ రిసెప్షన్‌ వద్దకు వెళ్లిన వలేరో, అక్కడ పనిచేసే ఉద్యోగులవద్ద నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో హత్యానేరంతో వలెరోను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. "ది ఇంకా" అనే ముద్దుపేరుతో పిలుచుకున్న ఈ బాక్సర్.. వెనిజులా అధ్యక్షుడు హుగో చావెజ్ మద్ధతుదార్లలో ఒకడు కావటం గమనార్హం.

కాగా.. గత మార్చి నెలలో అనుమానాస్పద రీతిలో భార్యను నిర్బంధించిన వలెరో.. అప్పటికే తాగుడు సంబంధిత సమస్యలకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ లైట్‌వెయిట్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈ బాక్సర్, తన భార్యను ఎందుకు హత్య చేశాడో మాత్రం వెల్లడికావటం లేదు.

Share this Story:

Follow Webdunia telugu