Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాకర్ పిచ్చి: కన్నకూతురినే కడతేర్చిన కసాయి తండ్రి!

Advertiesment
సాకర్ ప్రపంచకప్
FILE
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రపంచ సాకర్ ప్రపంచకప్‌.. గెలుపోటములకు వేదికవుతుంది. అలాగే కొన్ని ఉదంతాలకు సైతం నిలయమవుతోంది. ప్రపంచకప్ టోర్నీ పుణ్యమా అని దక్షిణాఫ్రికాలో దొంగలు పండగ చేసుకుంటుంటే.. సాకర్ పిచ్చి తలకెక్కి ఓ కసాయి తండ్రి కన్నకూతురినే కడతేర్చాడు. సాకర్ పైత్యం ప్రకోపించి, కన్నకూతురినే చంపేశాడు.

ఉత్కంఠగా మ్యాచ్‌ను చూస్తున్న సమయంలో తన రెండేళ్ల కూతురు ఏడుపు లంకించుకోవడంతో విసుగు చెందిన కసాయి తండ్రి, ఆ చిన్నారి గొంతులో పాశవికంగా స్క్రూ వేశాడు. దీంతో ఆ చిన్నారి ఏడ్వలేక, అరవలేక గిలకొట్టి తుదిశ్వాస విడిచింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన అమెరికాలో సంచలనం రేపింది.

ఉన్మాదిలా మారి కన్న కూతురినే బలిగొన్న ఆ కసాయి తండ్రి పేరు హెక్టర్ క్యాస్ట్రో (28). ఆ చిన్నారికి గొంతులో స్క్రూ వేయడం వల్ల ఊపిరాడక మృత్యువు ఒడిలోకి చేరుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఆ పాపాయిని క్యాస్ట్రో చిత్ర హింసలకు గురిచేసినట్టు కూడా సమాచారం. కాగా క్యాస్ట్రోకు ఆ చిన్నారి సవతి కూతురు కావడంతోనే ఆ పాపాయిని చంపేందుకు ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu