Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫార్ములావన్ వివాదం : హామిల్టన్‌కు చుక్కెదురు

Advertiesment
ఇతర క్రీడలు కథనాలు ఫార్ములావన్ వివాదం హామిల్టన్ చుక్కెదురు
, బుధవారం, 24 సెప్టెంబరు 2008 (19:48 IST)
బెల్జియం గ్రాండ్ ఫ్రి ఫార్ములావన్ రేస్ సందర్భంగా తనపై విధించిన జరిమానాను సవాలు చేసిన మెక్‌లారెన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు చుక్కెదురైంది. తనకు పెనాల్టీగా తన రేసు సమయంలో 25 సెకన్లను కలపడాన్ని సవాలు చేయడానికి హామిల్టన్‌కు అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది.

ఈ రేసు సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా సహ పోటీదారుడిని ఓవర్‌టేక్ చేసినందుకు గాను హామిల్టన్‌ రేసు పూర్తి చేసిన సమయానికి అదనంగా 25 సెకన్లు కలుపుతూ స్టీవార్డ్స్ నిర్ణయించారు. ఈ నిర్ణయంతో హామిల్టన్ రేసులో మూడో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. అయితే తనమీద విధించిన జరిమానా అన్యాయం అంటూ హామిల్టన్ ఎఫ్ఐఏ అప్పీల్ కోర్టుకు మొరపెట్టుకున్నాడు.

దీంతో హామిల్టన్ కేసును విచారించిన కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. నిబంధనల ప్రకారమే హామిల్టన్‌కు స్టీవార్డ్స్ జరిమానా విధించడం జరిగిందని కాబట్టి ఈ విషయంలో కోర్టుకు అప్పీలు చేసుకునే వీలు లేదని కోర్టు తీర్పునిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu