Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబుల్స్‌లో సరైన జోడి మహేష్ భూపతి

Advertiesment
మహేష్ భూపతి డబుల్స్ ర్యాంకులు సరైన జోడీ ఎవరంటే
, సోమవారం, 21 ఏప్రియల్ 2008 (20:45 IST)
ప్రపంచంలో ఎక్కడైనా మిక్స్‌డ్, మెన్స్ డబుల్స్‌లో పోరు జరుగుతుంటే సరైన జోడీ ఎవరంటే అందరికీ స్ఫురణకు వచ్చేది మహేష్ భూపతి. భూపతి అనేకసార్లు ఎందరితోనో జతకట్టి 43 టైటిళ్లను అందుకున్నాడు. డబ్ల్యూటీఏ తాజాగా ప్రకటించిన డబుల్స్ ర్యాంకుల్లో భూపతి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.

డబుల్స్‌లో భారతీయుడుగా తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను భూపతి 1997లో అందుకున్నాడు. 1997లో జరిగిన ఫ్రెంచి ఓపెన్‌లో జపాన్‌కు చెందిన రికా హిరాకీతో భూపతి జతకట్టి విజయదుందుభి మోగించాడు. చెన్నైకు చెందిన మహేష్ శ్రీనివాస్ భూపతి 1974, జూన్ 7వ తేదీన జన్మించారు.

మహేష్ భూపతి 1995 నుంచి టెన్నిస్‌లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌గా మారాడు. 1999లో వరుసగా మూడు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఇదే సంవత్సరంలో మహేష్ భూపతి-అయి సుగియామా (జపాన్) లు ప్రపంచ నెంబ‌ర్‌వన్ డబుల్స్ జట్టుగా రికార్డుకెక్కారు.

పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్‌తో జతకట్టి 1999లో ఫ్రెంచి ఓపెన్, వింబుల్డన్, 2001 ఫ్రెంచి ఓపెన్‌లను మహేష్ భూపతి కైవసం చేసుకున్నారు. 2002లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన మాక్స్ మిర్నీతో కలిసి జతకట్టి టైటిల్‌ను ఎగురేసుకు పోయారు.

మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీలను 1997 ఫ్రెంచి ఓపెన్, 1999, 2005లలో యూఎస్ ఓపెన్, 2002, 2005లలో వింబుల్డన్, 2006 ఆస్ట్రేలియా ఓపెన్‌ను మహేష్ భూపతి అందుకున్నారు. మహేష్-భూపతిలు 23 టైటిళ్ల ఫైనల్లో ప్రత్యర్ధులతో పోరాడారు.

Share this Story:

Follow Webdunia telugu