మెరుపువేగంతో టెన్నిస్ బ్యాట్‌ను కదిలిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే హైదరాబాదీ యువకెరటం సానియామీర్జా... హైదరాబాద్ వాస్తవ్యరాలుగా పరిచయమైనప్పటికీ ఆమె జన్మస్థలం మాత్రం ముంబై. 1986 నవంబర్ 15 వతేదీన జన్మించిన సానియా తన కెరీర్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది.
5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 57 కేజీల బరువును కలిగిన సానియా.. ఇటీవల సినిమాలలో నటించనున్నదన్న వార్తలు సైతం వచ్చాయి. సినిమాల్లో నటించే సంగతి అలా ఉంచితే టెన్నిస్ సింగిల్స్‌లో ఆమె 2007 ఆగస్టు 30న అత్యధిక ర్యాంక్ 26వ స్థానాన్ని సాధించింది. అదేవిధంగా డబుల్స్‌లో 2007 ఆగస్టు 27న తన కెరీర్‌లో అత్యధిక ర్యాంకింగ్ 18వ స్థానాన్ని సాధించిన కీర్తి గడించింది.