Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెన్నిస్ ఛాంపియన్‌లకు ఒలింపిక్ జ్వరం

Advertiesment
అగ్రశ్రేణి క్రీడాకారులకు ఒలింపిక్ జ్వరం పట్టుకుంది. మరో ముడు నెలల్లో టెన్నిస్ సమయం ఆసన్నం
ఇండియన్ వెల్స్ (ఏజెన్సీ) , శుక్రవారం, 28 మార్చి 2008 (13:49 IST)
ప్రపంచ టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులకు ఒలింపిక్ జ్వరం పట్టుకుంది. మరో ముడు నెలల్లో టెన్నిస్ సమయం ఆసన్నం కానుండగా.. స్విట్జర్లాండ్ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ మరియు ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు ఆగస్టులో ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌పై దృష్టి సారించారు.

గ్రామ్‌స్లామ్ టోర్నీలకు మరింత దగ్గరగా వచ్చి ఒలింపిక్ క్రీడలు ప్రాధాన్యతను సంతరించుకొనున్నాయని ఫెదరర్ అభిప్రాయపడుతుండగా... ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే ఈ క్రీడల్లో అగ్రస్థానంలో కొనసాగాలని ఆస్ట్రేలియా ఓపెన్టోర్నీ ఛాంపియన్ నొవాక్ జకోవిక్ ఆశిస్తున్నాడు.

1996లో జరిగిన అట్లాంటా క్రీడల్లో విజయపథంలో దూసుకెళ్లి తీపి గుర్తులను మిగుల్చుకున్న అమెరికా క్రీడాకారిణి లిండాసే డావెన్‌పోర్ట్ ప్రస్తుత ఒలింపిక్ క్రీడలను మరువనని తెలిపింది. ఇక గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కన్నా.. ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించేందుకే ఎక్కువ మక్కువ చూపుతానని రష్యా క్రీడాకారిణి స్వెత్లానా కుజ్‌నెత్సోవా పేర్కొంది.

కాగా, ఇప్పటివరకు 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేతగా నిలిచి.. పసిఫిక్ లైఫ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొన్న సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఒలింపిక్స్‌కు అధికప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపాడు. నిజానిక్ ఒలింపిక్ క్రీడలకు సమాయత్తమయ్యేందుకే తానీరకమైన షెడ్యూల్‌ను ప్రణాళిక చేసుకున్నట్లు చెప్పాడు.

తనకు రెండు గొప్ప అనుభవాలున్నట్లు వాటిని ఇలా వివరించాడు. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో ఫ్రెంచ్‌కు చెందిన ఆర్నాద్ డి పాస్క్వేల్‌ చేతిలో ఓటమి చవిచూడటంతో కాంస్యపతకాన్ని కోల్పోయానని.. అలాగే 2004 ఏథెన్స్‌లో జరిగిన క్రీడల్లో జెక్‌రిపబ్లిక్‌కు చెందిన థామస్ బెర్డిక్ అద్భుత ఆటతో రెండో రౌండు నుంచి నిష్క్రమించినట్లు వివరించాడు.

ఇక ప్రపంచ మహిళా టాప్ ర్యాంక్ క్రీడాకారిణి రష్యాకోవా మరియా షరపోవా.. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం తనకెంతో ఇష్టమని.. తన ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రీడల్లో పాల్గొనడం తన చిన్నప్పటి స్వప్నం అని తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఏడాదికి ఒకసారి జరిగితే.. ఒలింపిక్ క్రీడలు మాత్రం నాలుగేళ్లకొకసారి వచ్చే అపురూపమైన టోర్నీ అని వ్యాఖ్యానించింది.

1996 అట్లాంటా క్రీడల్లో జరిగిన మహిళా సింగిల్స్ విభాగంలో డావెన్‌పోర్ట్ స్వర్ణపతకాన్ని సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రీడల్లో తనకొక గొప్ప గౌరవస్థానం దక్కిందని... ఎంతో ఉన్నతమైన క్రీడలని మాజీ వింబుల్డన్, అమెరికా ఓపెన్ ఛాంపియన్ డావెన్‌పోర్ట్ విలేకరులకు తెలిపింది.

కాగా, ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌లు ఒలింపిక్ క్రీడలపై ఆసక్తి చూపుతుండటంతో వీరి మధ్య సాగే రసవత్తరమైన క్రీడను తిలకిస్తూ అభిమానులు కన్నుల పండువ చేసుకోనున్నారు. అలాగే అనారోగ్యంతో గత కొంతకాలంగా సరైన ఆటను ప్రదర్శించలేకపోతున్న ఫెదరర్ ఇకనైనా పుంజుకోగలడని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu