Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనూహ్యంగా గాయం నుంచి ఫిట్‌నెస్ సాధించిన హెనిన్!

అనూహ్యంగా గాయం నుంచి ఫిట్‌నెస్ సాధించిన హెనిన్!
FILE
మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి జస్టీన్ హెనిన్ అనూహ్యంగా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సూపర్ ఫిట్‌నెస్ సాధించింది. కేవలం ఆరు నెలల్లోనే మోచేయి గాయం నుంచి మెల్లమెల్లగా కోలుకుని ప్రస్తుతం టెన్నిస్ కోర్టులో రాణించేందుకు సిద్ధమవుతున్న హెనిన్‌ను చూసి ప్రత్యర్థులు హడలెత్తిపోతున్నారు.

ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న హెనిన్, రెండేళ్ల విరామం తర్వాత తిరిగి టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టింది. ఇంకా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లోకి చేరుకుని సంచలనం సృష్టించింది. అయితే 28 ఏళ్ల బెల్జియం స్టార్ హెనిన్ జూన్‌లో జరిగిన వింబుల్డన్ టోర్నీ నాలుగో రౌండ్లో గాయానికి గురైంది.

తద్వారా కిమ్ క్లియస్టర్స్‌తో జరిగిన నాలుగో రౌండ్లో హెనిన్ ఓటమి పాలైంది. దీంతో కొద్దినెలల పాటు టెన్నిస్ కోర్టుకు దూరమైన హెనిన్, పూర్తి ఫిట్‌నెస్ కొత్త సంవత్సరంలో జరిగే టోర్నీల్లో మెరుగ్గా రాణిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

వచ్చే ఏడాది జరుగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్, హోప్‌మన్ కప్‌ల్లో మెరుగ్గా రాణించేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానని జస్టిన్ చెప్పింది. కొత్త సంవత్సరంలో మెగా టోర్నీల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తానని అంటోంది.

గాయం నుంచి కోలుకున్నా. ఆరు నెలల పాటు గాయంతో సతమతమయ్యాను. ప్రస్తుతం వందశాతం పూర్తిగా కోలుకున్నా. ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నానని హెనిన్ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu