బీజింగ్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయిన బాక్సర్ అఖిల్ కుమార్‌లో ఇంకా పతకం సాధించే సత్తా ఉందని అతని కోచ్ జయదేవ్ బిష్ట్ పేర్కొన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో అదృష్టం కలిసి రాకే అఖిల్ పతకం కోల్పోయాడని ఆయన వ్యాఖ్యానించారు.
అఖిల్ గురించి బిష్ట్ మట్లాడుతూ అతను చాలా అంకితభావం గల బాక్సర్ అని కొనియాడారు. బీజింగ్ ఒలింపిక్స్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ఒక్కోసారి రాత్రిపూట కూడా ప్రాక్టీసుకు సిద్ధమయ్యేవాడని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం బీజింగ్ ఒలింపిక్స్‌లో అఖిల్ పతకం కోల్పోయినా రానున్న లండన్ ఒలింపిక్స్‌లో అఖిల్ తప్పక పతకం సాధిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లండన్ ఒలింపిక్స్ నాటికి అఖిల్ వయసు 31కి చేరుకున్నా అతను పతకం సాధించగలడని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.