Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చదరంగం గురించి మీకు తెలుసా? (video)

Advertiesment
చదరంగం గురించి మీకు తెలుసా? (video)
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (07:13 IST)
చదరంగం ఆటే..ఒకరకము ఆట .. మరి ఇది ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? .. కొన్ని శతాబ్దాల క్రితం.. మన దేశంలో బలహైతు అనే ఓ రాజు ఉండేవాడు. అతడోసారి తన ఆస్థానంలో తెలివైనవాడిగా పేరున్న సిస్సా అనే వ్యక్తిని పిలిపించాడు. 
 
'ఈనాటి ఆటలన్నీ బలం మీదనో, అదృష్టం మీదనో ఆధారపడి ఉన్నాయి. అలాకాకుండా తెలివితో ఆడే, తెలివిని పెంచే ఆటని రూపొందించగలరా?' అని అడిగాడు. సరేనన్న సిస్సా 64 గడులపై భట, సైనిక, హయ, గజ బలాలతో సాగే ఆటను రూపొందించి, 'చతురంగ' అని పేరు పెట్టాడు.
 
ఆ ఆటను చూసి మురిసిపోయిన రాజు 'ఇందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి' అన్నాడు. దానికి సిస్సా ఏం అడిగాడో తెలుసా? ఆ ఆటని ఆడే పట్టికలో మొదట గడిలో ఒక ధాన్యం గింజని ఉంచి, తరువాత ప్రతి గడికీ వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ 64 గడులకీ ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరాడు.

మొదట ఆ కోరిక చాలా చిన్నదని భావించిన రాజు ఆ తర్వాత దాన్ని తీర్చడం అసాధ్యమని గ్రహించాడు. ఎందుకో తెలుసా? అలా లెక్కించే ధాన్యం గింజల సంఖ్య 18,445,744,073,709,551,515 అని తేలుతుంది. ఇది ప్రపంచం మొత్తం మీద పండే ధాన్యం గింజల కన్నా ఎన్నో రెట్లు అధికం. అప్పుడు రాజు సిస్సాను ఘనంగా సత్కరించి ఆ ఆటను దేశదేశాల్లో ప్రచారం చేస్తాడు. చెస్‌ పుట్టుక వెనుక ప్రచారంలో ఉన్న కథ ఇది!
 
కథ పక్కన పెడితే చదరంగం పుట్టింది మన దేశంలోననే ఎక్కువ శాతం చరిత్రకారులు నమ్ముతారు. క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో దీన్ని ఆడినట్టు ఆధారాలున్నాయి. కొంతమంది మాత్రం చైనాలో పుట్టిందని చెబుతారు. అక్కడ రెండో శతాబ్దంలోనే చెస్‌ని పోలి ఉన్న క్సియాంగి అనే ఆటను ఆడేవారంటారు.
 
ఇప్పుడు మనం ఆడుతున్న ఆటకు 15వశతాబ్దంలో పూర్తి రూపం వచ్చింది. ఇది ఒక క్రీడగా గుర్తింపు పొందింది 19వ శతాబ్దంలో. ప్రపంచంలో తొలిసారిగా 1851లో చదరంగం పోటీలను లండన్‌లో నిర్వహించారు. అధికారికంగా ప్రపంచస్థాయి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జరిగింది మాత్రం 1886లో.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డే ర్యాంకింగ్స్‌: టాప్ ర్యాంక్‌లో భారత కెప్టెన్ మిథాలి