Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవర్ లిఫ్టింగ్ లో టర్కీలో ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటున్న నటి ప్రగతి

Advertiesment
Actress Pragati in powerlifting

దేవి

, శుక్రవారం, 5 డిశెంబరు 2025 (17:15 IST)
Actress Pragati in powerlifting
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఆమె నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్ లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్. జిల్లా, ప్రాంతీయ, సౌతిండియాతో పాటు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ ఆమె గెల్చుకోవడం విశేషం.

ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెల్చుకుంది. 2023లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన ప్రగతి..గత రెండేళ్లుగా హైదరాబాద్, తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో వరుసగా గోల్డ్ మెడల్స్ గెల్చుకుంటూ సత్తా చాటుతోంది. రేపు టర్కీలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో ప్రగతి పాల్గొంటున్నారు.
 
 పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి సాధించిన మెడల్స్ వివరాలు చూస్తే
 2023లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2023లో పవర్ లిఫ్టింగ్ ఇండియా తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2023లో తెనాలిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (5వ స్థానం)
2023లో ఎల్ బీ స్టేడియం వేదికగా జరిగిన బెంచ్ ప్రెస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఇండియా పోటీల్లో (గోల్డ్ మెడల్)
2023లో షేక్ పేటలో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్
2023లో బెంగళూరులో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్
2024లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్
2025లో ఖైరతాబాద్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్
2025లో హైదరాబాద్ రామాంతపూర్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్
2025లో కేరళలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్- దక్షిణాఫ్రికా డూ-ఆర్-డై మ్యాచ్‌.. విశాఖకు చేరిన ఇరు జట్లు.. కోహ్లీ ఇన్నింగ్స్ కోసం...?