Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాకర్ ప్రపంచకప్‌: క్వార్టర్స్ మ్యాచ్‌లకు "సై" అంటోన్న జట్లు..!

Advertiesment
సాకర్ ప్రపంచకప్
FILE
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సాకర్ ప్రపంచకప్ టోర్నీలో 16 రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్రపంచ దేశాలకు చెందిన అనేక జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీ లీగ్, ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల నుంచి 24 జట్లు నిష్క్రమించాయి. కాగా.. క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లకు శుక్రవారం నుంచి తెరలేవనుంది. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల పోరుకు పోర్చుగల్, ఇంగ్లాండ్, అమెరికా, పరాగ్వే, ఘనా జట్లు "సై" అంటున్నాయి.

టైటిల్ రేసులో ఉంటూ.. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌‌గా నిలిచిన బ్రెజిల్‌కు అసలైన పోరాటం ఎదురుకానుంది. గ్రూప్‌ దశలో ఓటమి ఎరుగని జట్టుగా గ్రూప్‌-జిలో అగ్రస్థానంతో ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న బ్రెజిల్‌ అక్కడ చిలీపై 3-0తో అలవోక విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

సాకర్‌ ప్రపంచకప్‌-2010లో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోని బ్రెజిల్‌ క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగుతోంది. కానీ నెదర్లాండ్ నుంచి బ్రెజిల్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

నెదర్లాండ్స్‌ పటిష్టమైన జట్టని, దక్షిణ అమెరికా ఆటతీరును పోలి ఉండే నెదర్లాండ్ శైలి ఎంతటి ప్రత్యర్ధికైన ప్రతిఘటన ఇవ్వగలదని బ్రెజిల్‌ కోచ్‌ దుంగా చెబుతున్నాడు. టెక్నిక్‌కి ప్రాధన్యమిస్తూ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడే నెదర్లాండ్స్‌తో జరగనున్న క్వార్టర్‌ ఫైనల్లో తాము ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా తగు మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నాడు.

నెదర్లాండ్‌, బ్రెజిల్‌లు ప్రపంచకప్‌ పోటీల్లో తలపడటం ఇది నాలుగో సారి కావడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో బ్రెజిల్ విజయాన్ని నమోదు చేసుకోగా, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెదర్లాండ్స్ గెలుపొందింది.

గత 1974వ సంవత్సరం జర్మనీలో జరిగిన ప్రపంచకప్‌ రెండో రౌండ్‌ పోటీల్లో నెదర్లాండ్స్‌ జట్టు బ్రెజిల్‌కు షాక్‌ ఇచ్చింది. అలాగే 1994వ సంవత్సరం అమెరికాలో జరిగిన వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌ 3-2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. అనంతరం ఫ్రాన్స్‌లో జరిగిన పోటీ సెమీఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌ ద్వారా బ్రెజిలే పైచేయి సాధించింది.

ఇకపోతే... గ్రూప్‌-ఈలో జపాన్‌పై 1-0, స్లొవేకియాపై 2-1తో గెలుపొంది కామెరూన్‌ చేతిలో 1-2తో పరాజయం పాలైన నెదర్లాండ్స్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌కు 2-0తో షాక్‌ ఇచ్చి తుది సూపర్-8లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు పోర్చుగల్, ఇంగ్లాండ్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లో ఫేవరేట్లుగా బరిలోకి దిగనున్నాయి. స్పెయిన్‌ను 1-0 తేడాతో మట్టికరిపించి, క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన పోర్చుగల్‌కు ప్రత్యర్థి జట్టు నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే సాకర్ ప్రపంచకప్ -2010 క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్ కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శించనుంది.

ఇదిలా ఉంటే సాకర్ ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జూలై రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్‌-బ్రెజిల్‌ల మధ్య బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే అర్థరాత్రి 12 గంటలకు ఉరుగ్వే-ఘనాల మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది.

జూలై మూడో తేదీన జరిగే మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా-జర్మనీలు తలపడతాయి. అదేరోజు రాత్రి 12 గంటలకు జరిగే నాలుగో మ్యాచ్‌లో పరాగ్వే-స్పెయిన్‌ల మధ్య సమరం ఉంటుంది. చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జూలై నాలుగో తేదీన జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu