Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూరో 2008 సమరానికి సన్నద్ధమైన జట్లు

Advertiesment
యూరో 2008 సమరానికి సన్నద్ధమైన జట్లు

Pavan Kumar

, శనివారం, 7 జూన్ 2008 (16:53 IST)
ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న యూరో 2008 సాకర్ సమరంలో తుదికంటా పోరాడటానికి ఐరోపా దేశాలు సన్నద్ధమయ్యాయి. యూరో సాకర్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య స్విట్జర్లాండ్-చెక్ రిపబ్లిక్‌లు తలపడతాయి. ఇరుదేశాల్లోని ఎనిమిది నగరాల్లోని వేదికల్లో 16 జట్లు 23 రోజులపాటు ఆడతాయి.

ఐరోపా దేశ సాకర్ జట్లు ఆడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పోరును తిలకించటానికి అభిమానులు సన్నద్ధమయ్యారు. టోర్నీలోకి ఆతిథ్య జట్లు ఆస్ట్రియా, స్విస్‌లు నేరుగా ప్రవేశించగా, మిగిలిన 14 జట్లు అర్హతా పోటీల్లో నెగ్గి రంగప్రవేశం చేశాయి. టోర్నీలో తొలిసారి ఆడుతున్న జట్లుగా ఆస్ట్రియా, పోలాండ్‌లు రికార్డు పుటలకెక్కాయి.

యూరో కప్ 2008 టోర్నీ 33 మ్యాచ్‌లు 8 ప్రాంతాల్లో జరుగుతాయి. ఇవి వియన్నా ఎర్నస్ట్ హ్యాపెల్ స్టేడియం, క్లాగెన్‌ఫర్ట్ హైపో-ఎరీనా, సాల్జ్ బర్గ్ వాల్స్ సీజిన్‌హెమ్ స్టేడియం, ఇన్స్‌బర్గ్ తివోలీ నూ, బాసెల్ సెయింట్ జాకబ్ పార్క్, బెర్న్ స్టేడ్ డీ సుస్సీ, జెనీవా స్టేడ్ డీ జెనీవా, జ్యూరిచ్ లెట్జి‌గృండ్ వేదికల్లో జరుగుతాయి. అన్నిటికంటే పెద్ద స్టేడియం వియన్నాలోని ఎర్నస్ట్ హ్యాపెల్. ఇక్కడ 53,008 మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్ తిలకించవచ్చు.

టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి లీగ్ దశలో తలపడతాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌లోకి అడుగుపెడతాయి. అక్కడ గెలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడతాయి. అంతిమ పోరు ఈనెల 29వ తేదీన వియన్నాలో జరుగుతుంది.

పోర్చుగల్ వేదికగా 2004లో జరిగిన యూరో టోర్నీ విజేతగా గ్రీస్ నిలిచింది. స్వంత గడ్డపై పోర్చుగల్ పరాజయం చవిచూసింది. యూరో సాకర్ టోర్నీ 1960 నుంచి ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతూ వస్తోంది. 1960లో రష్యా, 1964లో స్పెయిన్, 1968లో ఇటలీ, 1972లో జర్మనీ, 1976లో చెకోస్లొవేకియా, 1980లో జర్మనీ, 1984లో ఫ్రాన్స్, 1988లో నెదర్లాండ్స్, 1992లో డెన్మార్క్, 1996లో జర్మనీ, 2000లో ఫ్రాన్స్, 2004లో పోర్చుగల్ విజేతగా నిలిచింది.

టోర్నీలో అందరికంటే మిన్నగా జర్మనీ మూడుసార్లు (1972, 80, 96) విజేతగా ఆవిర్భవించింది. ఆ తర్వాత స్థానంలో ఫ్రాన్స్ రెండుసార్లు (1984, 2000) జయభేరి మోగించింది.

Share this Story:

Follow Webdunia telugu