Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు రెజ్లర్.. నేడు పేపర్ బోయ్

Advertiesment
చంద్రకాంత్.. తెలుగు వెండితెర ఇలవేల్పు 'మేజర్ చంద్రకాంత్' (ఎన్టీఆర్) చేతుల
FileFILE
చంద్రకాంత్.. తెలుగు వెండితెర ఇలవేల్పు 'మేజర్ చంద్రకాంత్' (ఎన్టీఆర్) చేతుల మీదుగా ఎన్నో పతకాలు అందుకున్న క్రీడాకారుడు. దేశ క్రీడా చిత్రపటంలో రాష్ట్రానికి ప్రత్యేక పేరు తెచ్చిన పెట్టిన వీరుడు. రెజ్లింగ్ విభాగంలో పలు పతకాలు సాధించిన చంద్రకాంత్... నేడు ఇంటింటికి పేపర్లూ వేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. 1978 నుంచి 98 వరకు రెజ్లింగ్‌ క్రీడా పోటీల్లో పాల్గొని వందకు పైగా పతకాలు సాధించిన చంద్రకాంత్... ప్రస్తుతం తన భార్యా పిల్లను సైతం పోషించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నాడు.

ఒకనాడు ఎంతగానో ఆదరించిన క్రీడాధికారులు ఇప్పుడు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులకు ఉపాధి కల్పించాలనే కనీస బాధ్యతను అధికారులు మరచిపోయారు. తనకు బతుకుదెరువు చూపించమని ఎన్నోసార్లు అధికారులను మొత్తుకున్నా కనికరించక పోవడంతో చేసేది ఏమీలేక పేపర్‌ బోయ్‌గా మారి జీవనం సాగిస్తున్నాడు. ఇలాంటి క్రీడాకారులు ఎంతోమంది ఇదే తరహా జీవనాన్ని గడుపుతున్నారన్నది జగమెరిగిన సత్యం.

Share this Story:

Follow Webdunia telugu